Showing posts with label Employees Corner. Show all posts
Showing posts with label Employees Corner. Show all posts

Telangana New EHS empanelled Hospitals search list and Health card Download Download 2026 | New EHS Card, Employee Login & Network Hospitals List

TS EHS Network Hospitals Search | TS Vidya News
Telangana EHS Network Hospitals Search
Search Telangana EHS Network Hospitals by Hospital Name, District or Address

🏥 EHS Health Card Download

Click Here

👨 Employee Login

Click Here

👴 Pensioner Login

Click Here

🏥 Network Hospitals

Search
📰 Latest Posts
Loading Latest Posts...
📚 Related EHS Posts
⚡ Quick Actions

© 2026 TS Vidya News All Rights Reserved.

Educational News | EHS | Teachers | Government Orders

RECONSTRUCTION OF SERVICE REGISTER IN CASE OF LOST/THEFT/MISSED

సర్వీసు రిజిష్టరు పోయిన/జాడ తెలియని సందర్భాలలో ఎలా పునర్నిర్మాణం చేయాలి?
Reconstruction of Service Book

సర్వీసు రిజిష్టరు పోయినప్పుడు పునర్నిర్మాణం ఎలా చేయాలి?

RECONSTRUCTION OF SERVICE REGISTER IN CASE OF LOST/THEFT/MISSED
How to re construct Service Book ?
  • సర్వీసు రిజిష్టరు ఉద్యోగికి ఆయువు పట్టులాంటిది. దానిలో నమోదు చేసిన విషయాల ఆధారంగానే ఉద్యోగి పదవీ విరమణ చేసిన తరువాత రావలసిన అన్ని రకాల ఆర్ధిక సౌలభ్యాలు పొందు అవకాశం ఉంది.
  • అట్టి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సర్వీసు రిజిష్టరు ఏ కారణం చేతనైనా పోయినా, కనిపించకపోయినా లేక అగ్ని ప్రమాదాల వల్ల కాలిపోయినా, అట్టి సర్వీసు రిజిష్టరు మరల ఎలా పునర్నిర్మాణం (Rebuilt or Reconstruction) అను విషయమై ప్రభుత్వం G.O.Ms.No.202 F&P తేది:11.06.1980 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.
ప్రధానమైన ప్రభుత్వ ఉత్తర్వులు
సర్వీసు రిజిష్టరు పునర్నిర్మాణానికి అవసరమైన వివరాలు
  • ఉద్యోగి నిర్వహించుచున్న నకలు(Duplicate) సర్వీసు రిజిష్టరులో నమోదు చేయబడి అటెస్టు చేసిన విషయాలు ఎంతవరకు నిజం అను విషయాలు సంబంధిత రికార్డ్స్ తోనూ, పేబిల్స్, వేతన స్థిరీకరణ పత్రములు,GIS, GPF,TSGLI,పదోన్నతికి సంబంధించిన సూచికలు, ఉద్యోగితో పాటు సహచర ఉద్యోగుల విషయంలో జారీచేసిన సామూహిక ఉత్తర్వులు, శాఖాధిపతి జారీచేసిన ఉత్తర్వులు తదితర అంశాలపై అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సర్వీసు రిజిష్టరు పునర్నిర్మాణం చేయవచ్చు.
  • *ఈ విషయంలో నకలు(Duplicate S.R) రిజిష్టరు చట్ట బద్ధమైనదిగా పరిగణించబడదు.*
  • ఈ విషయంలో నకలు(Duplicate S.R) రిజిష్టరు చట్టబద్ధమైనది కాదు. అధికారిక ప్రక్రియ ప్రకారం మాత్రమే పునర్నిర్మాణం చేయాలి.
  • అదే విధంగా ఉద్యోగి తన సర్వీసు విషయాలను గురించి ప్రమాణ పూర్వకంగా సంతకం చేసి వ్రాసిచ్చిన వాంగ్మూలము (Affadavit as attested) పరిశీలించి, అట్టి విషయములను సమాంతర (Collateral) ఉద్యోగుల సాక్ష్యాదారాలు ఉన్న పక్షమున అంగీకరించి పునర్నిర్మాణం చేయుచున్న సర్వీసు రిజిష్టరు లో నమోదుచేయాలి G.O.Ms.No.224 F &P తేదీ: 28.8.1982.
  • G.O.Ms.No.224 F&P (28.08.1982)
  • ఇంక్రిమెంటు రిజిష్టరు

    ఇంక్రిమెంటు రిజిష్టరు కార్యాలయంలో నిర్వహిస్తున్న యెడల, అట్టి రిజిష్టరు ఆధారంగా విషయాలు నమోదు చేయవచ్చు.

    పుట్టినతేది, విద్యార్హతలు, ఇతర వివరాలు

  • పుట్టినతేది, విద్యార్హతలు, ఉద్యోగి ఇతరత్రా వివరాలు విద్యాశాఖవారు జారీచేసిన సర్టిఫికెట్స్ ఆధారంగా సరిచూచి సర్వీసు రిజిష్టరులో నమోదు చేయవచ్చు. అదేవిధంగా ఉద్యోగం కోసం సర్వీసు కమీషను వారికి అభర్ధి పెట్టుకొన్న దరఖాస్తు ఆధారంగా కూడా సరిచూసుకోవచ్చును.
  • ఉద్యోగికి సంబంధించిన సర్వీసు వివరములు

    ఉద్యోగికి సంబంధించిన సర్వీసు వివరములు కొంతకాలం మేరకు తెలుసుకొనుటకు అవకాశం లేని పక్షమున, శాఖాధిపతి ఉద్యోగి అట్టి కాలములో సర్వీసులో ఉన్నాడని, సస్పెన్షన్ లో లేడని, అదే విధంగా Extra Ordinary Leave లో లేడని ఒక సర్టిఫికేట్ జారీచేయవచ్చు. కానీ అట్టి సర్టిఫికెట్ సాక్ష్యాధారములతో కూడిన వాటి మూలంశాల ఆధారితంగా ఉండవలెను.

@ Service Book Entries Matter (All Leaves, AGI, GIS, Fixations etc..)
@ Service Book Entries Hand Book
@ Maintenance of Service Book
Reconstruction of service register employees
Loading...

Popular Posts