Showing posts with label TET. Show all posts
Showing posts with label TET. Show all posts

TS TET 2025, EXAM Pattern,Eligibility, previous papers,Syllabus & Results

TSTET 2025 Eligibility,ecam pattern, syllabus,results ,final key
TSTET (Telangana TET) - సిలబస్, అర్హతలు, పేపర్లు, ఫలితాలు | TS Vidya News

TS Vidya News

Updated •6సెప్టెంబర్ 2025

TSTET (Telangana TET) 2025 — అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్, పేపర్లు & ఫలితాలు

TSTET గురించి కావాల్సిన అన్ని వివరాలు — అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్, మోడల్ పేపర్లు (PDF), పాత ప్రశ్న పేపర్లు, హాల్ టికెట్, ఫలితాలు — ఈ పేజీలో చూడండి.

TSTET

TET -Teacher Eligibility Test. ఇది ఉపాధ్యాయుల నియామకానికి తప్పనిసరి చేసిన అర్హత పరీక్ష.

  • ప్రభుత్వ/అంగన్వాడి/ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలకు తప్పనిసరి.
  • National Council for Teacher Education (NCTE) మార్గదర్శకాల ప్రకారం ఇది తప్పనిసరి అర్హత.

అర్హతలు (Eligibility)

పేపర్ 1 (Class I–V):
  • D.Ed లేదా B.Ed పూర్తి చేసి ఉండాలి.
పేపర్ 2 (Class VI–VIII):
  • గ్రాడ్యుయేషన్ + B.Ed లేదా సమాన విద్యార్హతలు ఉండాలి (BA.B.Ed / BSc.B.Ed మొదలైనవి).
  • కనీసం 50% మార్కులు (SC/ST/BC/PH కి 45% వరకు రాయితీ ఉంటుంది).
  • అర్హతల కోసం ఎప్పటికప్పుడు అధికారిక నోటిఫికేషన్లు చూడండి TSTET Portal.

పరీక్ష విధానం (Exam Pattern)

పేపర్ఎవరికోసంమార్కులుసమయం
Paper IClass I–V, ఉపాధ్యాయుల కోసం 1502.5 గంటలు
Paper IIClass VI–VIII,ఉపాధ్యాయుల కోసం 1502.5 గంటలు

Paper I -Subjects(Classes I–V)

విషయంప్రశ్నలుమార్కులు
Child Development & Pedagogy3030
Language I (తెలుగు/ఉర్దూ/హిందీ)3030
Language II (English)3030
Mathematics3030
Environmental Studies (EVS)3030
మొత్తం150150

⏱️ కాల పరిమితి: 150 నిమిషాలు

Paper II -Subjects (Classes VI–VIII)

విషయంప్రశ్నలుమార్కులు
Child Development & Pedagogy3030
Language I- (Telugu)3030
Language II-(English)3030
Maths & Science OR Social Studies6060
మొత్తం150150

⏱️ కాల పరిమితి: 150 నిమిషాలు

సిలబస్

Paper I & II సిలబస్‌లో Pedagogy, Languages, Maths, Science/Social Studies ఉన్నాయి.

సిలబస్ NCERT / SCERT పాఠ్య పత్రాల ఆధారంగా రూపొందించబడింది; ముఖ్యంగా:

  • Child Development: శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధి, లోచనా పద్ధతులు, బోధనశాస్త్రం.
  • Languages: పఠనం, వ్యాకరణం, పదసంబంధం, అవగాహన, రచనా చిత్తగింపు.
  • పరిశోధన: Maths/Science/Social topics — సంబంధిత తరగతుల ముఖ్యాంశాలు.

మోడల్ పేపర్లు (Model Papers)


పాత ప్రశ్న పేపర్లు (Previous Papers)

HALLTICKETS

ఫలితాలు RESULTS

👉 అధికారిక సమాచారం కోసం ఎల్లప్పుడూ TSTET సైట్ ను చూడండి.

Latest Posts

లోడవుతోంది...

Related Posts

© 2025 tsvidhya news.blogspot.com

RECONSTRUCTION OF SERVICE REGISTER IN CASE OF LOST/THEFT/MISSED

సర్వీసు రిజిష్టరు పోయిన/జాడ తెలియని సందర్భాలలో ఎలా పునర్నిర్మాణం చేయాలి?
Reconstruction of Service Book

సర్వీసు రిజిష్టరు పోయినప్పుడు పునర్నిర్మాణం ఎలా చేయాలి?

RECONSTRUCTION OF SERVICE REGISTER IN CASE OF LOST/THEFT/MISSED
How to re construct Service Book ?
  • సర్వీసు రిజిష్టరు ఉద్యోగికి ఆయువు పట్టులాంటిది. దానిలో నమోదు చేసిన విషయాల ఆధారంగానే ఉద్యోగి పదవీ విరమణ చేసిన తరువాత రావలసిన అన్ని రకాల ఆర్ధిక సౌలభ్యాలు పొందు అవకాశం ఉంది.
  • అట్టి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సర్వీసు రిజిష్టరు ఏ కారణం చేతనైనా పోయినా, కనిపించకపోయినా లేక అగ్ని ప్రమాదాల వల్ల కాలిపోయినా, అట్టి సర్వీసు రిజిష్టరు మరల ఎలా పునర్నిర్మాణం (Rebuilt or Reconstruction) అను విషయమై ప్రభుత్వం G.O.Ms.No.202 F&P తేది:11.06.1980 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.
ప్రధానమైన ప్రభుత్వ ఉత్తర్వులు
సర్వీసు రిజిష్టరు పునర్నిర్మాణానికి అవసరమైన వివరాలు
  • ఉద్యోగి నిర్వహించుచున్న నకలు(Duplicate) సర్వీసు రిజిష్టరులో నమోదు చేయబడి అటెస్టు చేసిన విషయాలు ఎంతవరకు నిజం అను విషయాలు సంబంధిత రికార్డ్స్ తోనూ, పేబిల్స్, వేతన స్థిరీకరణ పత్రములు,GIS, GPF,TSGLI,పదోన్నతికి సంబంధించిన సూచికలు, ఉద్యోగితో పాటు సహచర ఉద్యోగుల విషయంలో జారీచేసిన సామూహిక ఉత్తర్వులు, శాఖాధిపతి జారీచేసిన ఉత్తర్వులు తదితర అంశాలపై అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సర్వీసు రిజిష్టరు పునర్నిర్మాణం చేయవచ్చు.
  • *ఈ విషయంలో నకలు(Duplicate S.R) రిజిష్టరు చట్ట బద్ధమైనదిగా పరిగణించబడదు.*
  • ఈ విషయంలో నకలు(Duplicate S.R) రిజిష్టరు చట్టబద్ధమైనది కాదు. అధికారిక ప్రక్రియ ప్రకారం మాత్రమే పునర్నిర్మాణం చేయాలి.
  • అదే విధంగా ఉద్యోగి తన సర్వీసు విషయాలను గురించి ప్రమాణ పూర్వకంగా సంతకం చేసి వ్రాసిచ్చిన వాంగ్మూలము (Affadavit as attested) పరిశీలించి, అట్టి విషయములను సమాంతర (Collateral) ఉద్యోగుల సాక్ష్యాదారాలు ఉన్న పక్షమున అంగీకరించి పునర్నిర్మాణం చేయుచున్న సర్వీసు రిజిష్టరు లో నమోదుచేయాలి G.O.Ms.No.224 F &P తేదీ: 28.8.1982.
  • G.O.Ms.No.224 F&P (28.08.1982)
  • ఇంక్రిమెంటు రిజిష్టరు

    ఇంక్రిమెంటు రిజిష్టరు కార్యాలయంలో నిర్వహిస్తున్న యెడల, అట్టి రిజిష్టరు ఆధారంగా విషయాలు నమోదు చేయవచ్చు.

    పుట్టినతేది, విద్యార్హతలు, ఇతర వివరాలు

  • పుట్టినతేది, విద్యార్హతలు, ఉద్యోగి ఇతరత్రా వివరాలు విద్యాశాఖవారు జారీచేసిన సర్టిఫికెట్స్ ఆధారంగా సరిచూచి సర్వీసు రిజిష్టరులో నమోదు చేయవచ్చు. అదేవిధంగా ఉద్యోగం కోసం సర్వీసు కమీషను వారికి అభర్ధి పెట్టుకొన్న దరఖాస్తు ఆధారంగా కూడా సరిచూసుకోవచ్చును.
  • ఉద్యోగికి సంబంధించిన సర్వీసు వివరములు

    ఉద్యోగికి సంబంధించిన సర్వీసు వివరములు కొంతకాలం మేరకు తెలుసుకొనుటకు అవకాశం లేని పక్షమున, శాఖాధిపతి ఉద్యోగి అట్టి కాలములో సర్వీసులో ఉన్నాడని, సస్పెన్షన్ లో లేడని, అదే విధంగా Extra Ordinary Leave లో లేడని ఒక సర్టిఫికేట్ జారీచేయవచ్చు. కానీ అట్టి సర్టిఫికెట్ సాక్ష్యాధారములతో కూడిన వాటి మూలంశాల ఆధారితంగా ఉండవలెను.

@ Service Book Entries Matter (All Leaves, AGI, GIS, Fixations etc..)
@ Service Book Entries Hand Book
@ Maintenance of Service Book
Reconstruction of service register employees
Loading...

Popular Posts