Showing posts with label Service. Show all posts
Showing posts with label Service. Show all posts

How to Upload Service Register in IFMIS Portal 2026 | Complete DDO Guide

IFMIS SR Upload Process 2026 – How to Upload Scanned Service Register PDF Online

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల Service Register ను స్కాన్ చేసి ,pdf ఫార్మాట్ లో కి మార్చి, ఫైల్ name ఇచ్చిన విధానంలో సేవ్ చేసి IFMIS సైట్ లో Upload చేయుట -పూర్తి విధానం

IFMIS SR Upload

తెలంగాణ ప్రభుత్వం IFMIS Portal ద్వారా ఉద్యోగుల Service Register (SR)లను డిజిటల్ రూపంలో అప్లోడ్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. DDOలు ఈ ప్రక్రియను జాగ్రత్తగా పూర్తి చేయాలి.

*
IFMIS SR Upload steps process
*

📌 Step By Step SR Upload Process

Step 1: IFMIS Portal Login

  • DDO User ID & Password తో Login అవ్వాలి
  • HR Module ఓపెన్ చేయాలి
IFMIS Login

Step 2: Employee Masters

  • Employee Masters పై క్లిక్ చేయాలి
  • సంబంధిత ఉద్యోగిని ఎంపిక చేయాలి
Employee Masters

Step 3: Upload SR

  • Upload SR పై క్లిక్ చేయాలి
  • లేదా Employee Details Page లో Upload బటన్ ఉపయోగించాలి
Upload SR

Step 4: Verify Employee Code

Employee Code సరైనదేనా తప్పకుండా చెక్ చేయాలి.

Step 5: Save as PDF

  • PDF Format మాత్రమే
  • Single PDF File ఉండాలి
  • 50MB లోపు ఉండాలి

📄 PDF File Name Format

అప్లోడ్ చేసే PDF ఫైల్‌ను ఈ విధంగా Rename చేయాలి:

SR_(EmployeeCode)_(EmployeeName).pdf

✅ Example:

  • SR_123456_RameshKumar.pdf
  • SR_987654_Suresh.pdf

📦 PDF File Size Compress చేయడం ఎలా?

Note: PDF ఫైల్ సైజు 50 MB కంటే ఎక్కువగా ఉంటే Upload చేసే ముందు Compress చేయాలి.

PDF Compress Websites:

✅ Compress చేసే విధానం

  • పై Website ఓపెన్ చేయండి
  • PDF Upload చేయండి
  • Compress Button పై క్లిక్ చేయండి
  • Compressed PDF Download చేసుకోండి
  • తర్వాత IFMIS Portal లో Upload చేయండి

✅ Upload ముందు చెక్ లిస్ట్

  • అన్ని పేజీలు ఉన్నాయా?
  • సరైన క్రమంలో ఉన్నాయా?
  • Entries స్పష్టంగా కనిపిస్తున్నాయా?
  • ఏ పేజీ Rotate కాలేదా?
  • PDF సరిగా Open అవుతుందా?
విషయం వివరాలు
ఫైల్ ఫార్మాట్ PDF మాత్రమే
గరిష్ట సైజు 50MB
Re-upload Edit Icon ద్వారా
హెల్ప్‌లైన్ 7042420033
TS Vidhya News Logo

RECONSTRUCTION OF SERVICE REGISTER IN CASE OF LOST/THEFT/MISSED

సర్వీసు రిజిష్టరు పోయిన/జాడ తెలియని సందర్భాలలో ఎలా పునర్నిర్మాణం చేయాలి?
Reconstruction of Service Book

సర్వీసు రిజిష్టరు పోయినప్పుడు పునర్నిర్మాణం ఎలా చేయాలి?

RECONSTRUCTION OF SERVICE REGISTER IN CASE OF LOST/THEFT/MISSED
How to re construct Service Book ?
  • సర్వీసు రిజిష్టరు ఉద్యోగికి ఆయువు పట్టులాంటిది. దానిలో నమోదు చేసిన విషయాల ఆధారంగానే ఉద్యోగి పదవీ విరమణ చేసిన తరువాత రావలసిన అన్ని రకాల ఆర్ధిక సౌలభ్యాలు పొందు అవకాశం ఉంది.
  • అట్టి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సర్వీసు రిజిష్టరు ఏ కారణం చేతనైనా పోయినా, కనిపించకపోయినా లేక అగ్ని ప్రమాదాల వల్ల కాలిపోయినా, అట్టి సర్వీసు రిజిష్టరు మరల ఎలా పునర్నిర్మాణం (Rebuilt or Reconstruction) అను విషయమై ప్రభుత్వం G.O.Ms.No.202 F&P తేది:11.06.1980 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.
ప్రధానమైన ప్రభుత్వ ఉత్తర్వులు
సర్వీసు రిజిష్టరు పునర్నిర్మాణానికి అవసరమైన వివరాలు
  • ఉద్యోగి నిర్వహించుచున్న నకలు(Duplicate) సర్వీసు రిజిష్టరులో నమోదు చేయబడి అటెస్టు చేసిన విషయాలు ఎంతవరకు నిజం అను విషయాలు సంబంధిత రికార్డ్స్ తోనూ, పేబిల్స్, వేతన స్థిరీకరణ పత్రములు,GIS, GPF,TSGLI,పదోన్నతికి సంబంధించిన సూచికలు, ఉద్యోగితో పాటు సహచర ఉద్యోగుల విషయంలో జారీచేసిన సామూహిక ఉత్తర్వులు, శాఖాధిపతి జారీచేసిన ఉత్తర్వులు తదితర అంశాలపై అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సర్వీసు రిజిష్టరు పునర్నిర్మాణం చేయవచ్చు.
  • *ఈ విషయంలో నకలు(Duplicate S.R) రిజిష్టరు చట్ట బద్ధమైనదిగా పరిగణించబడదు.*
  • ఈ విషయంలో నకలు(Duplicate S.R) రిజిష్టరు చట్టబద్ధమైనది కాదు. అధికారిక ప్రక్రియ ప్రకారం మాత్రమే పునర్నిర్మాణం చేయాలి.
  • అదే విధంగా ఉద్యోగి తన సర్వీసు విషయాలను గురించి ప్రమాణ పూర్వకంగా సంతకం చేసి వ్రాసిచ్చిన వాంగ్మూలము (Affadavit as attested) పరిశీలించి, అట్టి విషయములను సమాంతర (Collateral) ఉద్యోగుల సాక్ష్యాదారాలు ఉన్న పక్షమున అంగీకరించి పునర్నిర్మాణం చేయుచున్న సర్వీసు రిజిష్టరు లో నమోదుచేయాలి G.O.Ms.No.224 F &P తేదీ: 28.8.1982.
  • G.O.Ms.No.224 F&P (28.08.1982)
  • ఇంక్రిమెంటు రిజిష్టరు

    ఇంక్రిమెంటు రిజిష్టరు కార్యాలయంలో నిర్వహిస్తున్న యెడల, అట్టి రిజిష్టరు ఆధారంగా విషయాలు నమోదు చేయవచ్చు.

    పుట్టినతేది, విద్యార్హతలు, ఇతర వివరాలు

  • పుట్టినతేది, విద్యార్హతలు, ఉద్యోగి ఇతరత్రా వివరాలు విద్యాశాఖవారు జారీచేసిన సర్టిఫికెట్స్ ఆధారంగా సరిచూచి సర్వీసు రిజిష్టరులో నమోదు చేయవచ్చు. అదేవిధంగా ఉద్యోగం కోసం సర్వీసు కమీషను వారికి అభర్ధి పెట్టుకొన్న దరఖాస్తు ఆధారంగా కూడా సరిచూసుకోవచ్చును.
  • ఉద్యోగికి సంబంధించిన సర్వీసు వివరములు

    ఉద్యోగికి సంబంధించిన సర్వీసు వివరములు కొంతకాలం మేరకు తెలుసుకొనుటకు అవకాశం లేని పక్షమున, శాఖాధిపతి ఉద్యోగి అట్టి కాలములో సర్వీసులో ఉన్నాడని, సస్పెన్షన్ లో లేడని, అదే విధంగా Extra Ordinary Leave లో లేడని ఒక సర్టిఫికేట్ జారీచేయవచ్చు. కానీ అట్టి సర్టిఫికెట్ సాక్ష్యాధారములతో కూడిన వాటి మూలంశాల ఆధారితంగా ఉండవలెను.

@ Service Book Entries Matter (All Leaves, AGI, GIS, Fixations etc..)
@ Service Book Entries Hand Book
@ Maintenance of Service Book
Reconstruction of service register employees
Loading...

Popular Posts